![]() |
![]() |
.webp)
శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది.
తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది.
తాజాగా శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు. అయితే కొన్నిరోజుల క్రితం శివజ్యోతి చేసిన ' పెద్దమ్మ తల్లికి యాటను కోసినం' అనే వ్లాగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా ' మీరు ఎప్పటినుండో అడుగుతున్న మా హోమ్ టూర్ మీ కోసం ' అంటూ వ్లాగ్ చేసింది శివజ్యోతి. ఇందులో వాళ్ళ సొంతింటిని చూపిస్తూ.. ఈ ఇల్లు కొన్న వన్ మంత్ కే లాక్ డౌన్ వచ్చిందని, ఈ ఇల్లు కోసం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు చేశారంట, అదీ కాక ఒక రెండు లక్షలు అప్పు కుడా తెచ్చినట్టు చెప్పింది శివజ్యోతి. కాగా ఇప్పుడు 'జ్యోతక్క' యూట్యూబ్ ఛానెల్ లోని ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |